– సూర్యాపేట జిల్లా పశు వైద్యాధికారి శ్రీనివాసరావు
నేరేడుచర్ల, నవంబర్ 07 : సూర్యాపేట జిల్లాలో ఈ నెల 15 వరకు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నట్లు జిల్లా పశు వైద్యాధికారి దామచర్ల శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా టీకాలు వేసే కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతుందన్నారు. టీకాలు వేసే గ్రామాల్లో రైతులకు ఒకరోజు ముందుగా చాటింపు ద్వారా సమాచారం ఇస్తున్నట్లు తెలిపారు. నేరేడుచర్ల మండలంలో నాలుగు బృందాలుగా ఏర్పడి అన్ని గ్రామాల్లో పశువులకు టీకాలు వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు కందుల సత్యనారాయణ, ఎల్ ఎస్ ఏ దుర్గాభవాని, సిబ్బంది మహమ్మద్ ఇస్మాయిల్ పాల్గొన్నారు.