నందికొండ, ఆగస్టు 22: శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి వరద జోరు కొనసాగుతోంది. సాగర్‌కు 4,05,410 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో అదేస్థాయిలో అవుట్ ఫ్లో ను కొనసాగిస్తున్నారు. సాగర్ డ్యాం 26 క్రస్ట్ గేట్ల ను 10 అడుగుల మేర ఎత్తి 3,54,120 క్యూసెక్కుల నీటిని స్పీల్వే మీదుగా దిగువకు విడుదల చేస్తున్నారు.
ఎడమ కాల్వ ద్వారా 6,401 క్యూసెక్కులు, కుడి కాల్వ ద్వారా 9,019 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్ర ద్వారా 33,170 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 2400, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గానూ 583.40(292.8208 టీఎంసీల)అడుగుల మేర నీరు నిల్వ ఉంది. శ్రీశైలం జలాశయానికి 5,32, 567 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా, డ్యాం 10 క్రస్ట్ గేట్ల ద్వారా 4,22,110 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నాగార్జునసాగర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు.