త్రిపురారం, డిసెంబర్ 6 : అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మంగళవారం త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామంలో చెరువులో చేప పిల్లలు వదిలిన అనంతరం మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న ఉచిత చేపపిల్లల పంపిణీతో రాష్ట్రం లో చేపల ఎదుగుదల రెండింతలు పెరిగిందని, సహజ నీటి వనరుల్లో చేప పిల్లల పెంపకంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు.
చెక్కుల అందజేత
మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన 21 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ తాసీల్దార్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమాల్లో జడ్పీటీసీ భారతీ భాస్కర్‌నాయక్, ఎంపీపీ అనుముల పాండమ్మ, నాయబ్ తాసీల్దార్ గాదె సైదులు, ఆర్ఐ గుండెబోయిన సైదులు, సర్పంచులు శ్రీనివాస్‌రెడ్డి, బాలరమణీబాయి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నరేందర్, చైర్మన్ సింగం దుర్గయ్య, నాయకులు చంద్రారెడ్డి, రామచంద్రయ్య, వెంకటాచారి, అనంతరెడ్డి, శ్రీను, ధనలక్ష్మి, వెంకటేశ్వర్లు, చందు, శ్యాంసుందర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, అంబటి రాము, అనంతరెడ్డి, పెద్దబోయిన శ్రీనివాస్ యాదవ్, మడుపు వెంకటేశ్వర్లు రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.