ఆలేరు టౌన్, మార్చి 12 : విద్యుత్ స్తంభంపై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమై మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఆలేరు పట్టణ కేంద్రంలో జరిగింది. షార్ట్ సర్క్యూట్ ఇందుకు కారణంగా తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంతపురి రోడ్డులోని కూల్ డ్రింక్స్ ఏజెన్సీ సమీపంలో గల ఇనుప స్తంభంపై ఒక్కసారిగా మంటలు చెల్లరేగాయి.
వెంటనే స్థానికులు గుర్తించి విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో లైన్మెన్ రమేశ్ సమీపంలోని బిల్డింగ్ పైకి ఎక్కి నీళ్లు, కర్రలతో కొడుతూ మంటలు ఆర్పాడు. ఆ సమయంలో విద్యుత్ సరఫరా అవుతుండడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. స్తంభంపై విచక్షణారహితంగా ఇంటర్నెట్, టీవీ కేబుల్ వైర్లు ఉండడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం.