నకిరేకల్, ఏప్రిల్ 15 : నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని వీటి కాలనీలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇంట్లో దేవుడికి పెట్టిన దీపం అంటుకోవడంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు పక్కనే ఉన్న మరో రెండు ఇళ్లకు వ్యాపించాయి. పొగ భారీగా కమ్ముకోవడంతో ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టింది. మంటలు ఇంట్లోని గ్యాస్ సిలిండర్లకు అంటుకోకముందే ఫైర్ సిబ్బంది అప్రమత్తమై వాటిని వెలుపలికి తీసుకువచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. మంటలను ఫైర్ సిబ్బంది పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చింది.