ఆలేరు టౌన్, మార్చి 11 : ఆలేరు పట్టణానికి చెందిన ఎమ్మె బాలకిషన్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. తనతో పాటు విద్యనభ్యసించిన ఆలేరు జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ 2001 – 2002 బ్యాచ్ కు చెందిన 68 మంది పూర్వ విద్యార్థులు రూ.61,600/- ను విరాళంగా కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఆలేరు పోస్ట్ ఆఫీస్ లో బాలకిషన్ కుమారుడు, కుమార్తె పేరు మీద మంగళవారం ఈ మొత్తాన్ని డిపాజిట్ చేసి, పాస్బుక్ లను కుటుంబానికి అందజేసి బాసటగా నిలిచారు. ఈ కార్యక్రమంలో పంతం కృష్ణ, ఆలేటి అజయ్ కుమార్, కళ్లెం జితేందర్, ఎండి. హకిమ్, బండ్రు సిద్ధులు, గంజి వెంకటేశ్ పాల్గొన్నారు.