సూర్యాపేట, జనవరి 26 : సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన మట్టయ్య చారి ఇటీవల అనారోగ్యం చనిపోయారు. సోమవారం సూర్యాపేటలోని బులియన్ మర్చంట్ అసోసియేషన్ కార్యాలయంలో మట్టయ్య చారి కుటుంబానికి అసోసియేషన్ అధ్యక్షుడు అంతటి విజయకుమార్ లక్ష 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టయ్య చారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ మన్నే సింహాద్రి, కోశాధికారి బుర్లే మధుసూదన్, గుణగంటి రాములు, అంతటి రాములు, జిల్లేపల్లి శ్రీనివాస్, అంతటి జానీ, వెన్న నరేష్ రెడ్డి, అంతటి కృష్ణ, కక్కిరేణి శేఖర్ పాల్గొన్నారు.