తుంగతుర్తి, జూన్ 20 : ప్రైవేట్ స్కూళ్లల్లో ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నాయకులు ఎంఈఓ బోయిని లింగయ్యకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నియోజకవర్గ నాయకులు తడకమళ్ల రవికుమార్, గునిగంటి సంతోష్ గౌడ్ మాట్లాడుతూ.. మధ్యతరగతి, పేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక ఉపశమనం కలిగించడమే లక్ష్యంగా ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు తమిళనాడు తరహాలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చింతకుంట్ల మనోజ్, గోపగాని రమేష్ గౌడ్, బొజ్జ సాయికిరణ్, కొండగడుపుల వెంకటేష్, కొండగడుపుల శ్రీకాంత్, తడకమళ్ల మధు పాల్గొన్నారు.