నీలగిరి, ఏప్రిల్ 20 : కోడలి ఆత్మహత్యకు కారణమైన మామను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను సోమవారం సీఐ రాఘవరావు వెల్లడించారు. నాంపల్లి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన ఐశ్వర్య (20)కు ఐదు నెలల క్రితం పానగల్లుకు చెందిన శివశంకర్‌తో వివాహం జరిగింది. భర్త ఇంట్లో లేని సమయంలో మామ వర్రే లింగయ్య తరచూ వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు. ప్రతి చిన్న విషయానికీ తప్పుపట్టడం, అవమానించడం, మానసికంగా హింసించడం చేసినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదులో తెలిపారు.
“నువ్వు చస్తే నా కొడుకుకు ఇంకా మంచి భార్య వస్తుంది” అంటూ తీవ్రంగా మామ లింగయ్య కొడలిని వేధింపులకు గురి చేసేవాడు. ఈ వేధింపులు తట్టుకోలేక ఐశ్యర్య ఈ నెల 18న ఉదయం పానగల్లు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి చింతల వెంకటయ్య ఫిర్యాదుతో నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఎస్ఐ సైదులు ఆధర్యంలో దర్యాప్తు చేపట్టి వర్రే లింగయ్య (45)ను ఈరోజు ఉదయం అతడి నివాసంలో అరెస్టు చేశారు. సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరిచేందుకు రిమాండ్‌కు తరలింపు.