కట్టంగూర్, జనవరి 28 : కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రైతు మోసాలపై మంగళవారం నల్లగొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నాకు మండలం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. వారిలో మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు, పోగుల నర్సింహ, వడ్డె సైదిరెడ్డి, గడుసు కోటిరెడ్డి, పనస సైదులు, చిట్యాల రాజిరెడ్డి, ముప్పిడి యాదయ్య, పోతరాజు నగేశ్, ఊట్కూరి ఏడుకొండలు ఉన్నారు.
శాలిగౌరారం : మండలం బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అయితగోని వెంకన్నగౌడ్, కట్టా వెంకట్‌రెడ్డి, మామిడి సర్వయ్య, గుజిలాల్ శేఖర్‌బాబు, బీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు కల్లూరి నాగరాజుగౌడ్, జెర్రిపోతుల చంద్రమౌళిగౌడ్, అక్కెనపెల్లి శ్రీరాములు, దాసరి వెంకన్న, పున్నమినాగులు మహాధర్నాకు వెళ్లారు.
కేతేపల్లి : మండలం నుంచి పార్టీ మండలాధ్యక్షుడు మారం వెంకట్‌రెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, నాయకులు బంటు మహేందర్, బి.సురేశ్, కె.సైదిరెడ్డి, ఆర్.సైదులుగౌడ్, తదితరులు తరలి వెళ్లారు.
కొండమల్లేపల్లి : మండలం నుంచి రైతుబంధు సమితి మాజీ మండలాధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమావత్ దస్రూనాయక్, మండల యువజన అధ్యక్షుడు రమావత్ తులసీరాం నాయక్, మాజీ సర్పంచ్ జబ్బు యాదయ్య, పెద్దిశెట్టి సత్యనారయణ, దాచేపల్లి నరేందర్, శేఖర్‌యాదవ్ వెళ్లారు.
చందంపేట(దేవరకొండ) /పెద్దఅడిశర్లపల్లి : చందంపేట మండలం నుంచి మాజీ జడ్పీటీసీ సలహాదారుడు రమావత్ మోహన్ కృష్ణ, మాజీ జడ్పటీసీ బోయపల్లి శ్రీనివాస్‌గౌడ్, నాయకులు మండల ప్రధాన కార్యదర్శి గోసుల శివ, సత్యనారాయణగౌడ్, తరి గోవర్ధన్, శంకర్‌నాయక్, బలరాం, గోపాల్ రమేశ్, జబ్బు తిరుపతయ్య, తిరుపతిరావు, కేతావత్ హరి, గోపాల్‌నాయక్ పాల్గొన్నారు. పెద్దఅడిశర్లపల్లి బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వల్లపురెడ్డి ఆధ్వర్యంలో రైతులు ధర్నాకు తరిలారు.
మర్రిగూడ : మండలం నుంచి మాల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దంటు జగదీశ్వర్, మాజీ వైస్ ఎంపీపీ కట్కూరి వెంకటేశ్‌గౌడ్, సీనీయర్ నాయకులు రామిడి వెంకటరమణారెడ్డి, అయిలీ లక్ష్మీనర్సింహాగౌడ్, మాజీ సర్పంచ్ నల్ల యాదయ్య, నాయకులు వెళ్లారు.
మర్రిగూడ(నాంపల్లి) : నాంపల్లి మండలం నుంచి పార్టీ మండలాధ్యక్షుడు గుమ్మడపు నర్సింహారావు, నాయకులు పోగుల వెంకట్ రెడ్డి, ఇట్టం వెంకట్‌రెడ్డి, కడారి శ్రీశైలం యాదవ్, మాజీ సర్పంచ్‌లు బాషిపాక రాములు, కారింగు నర్సింహ, రవినాయక్, నాగులవంచ శ్రీలత, మాజీ ఎంపీటీసీ సప్పిడి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సహకార చైర్మన్ నక్క చంద్రశేఖర్ వెళ్లారు.
మునుగోడు : మాజీ ఎమ్మెల్యే కూసుకంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో మహధర్నాకు మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.
హాలియా : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ హాలియాలో పార్టీ జెండా ఊపి వాహన ర్యాలీని ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే కూడా బైక్‌పై ర్యాలీగా నల్లగొండకు తరలివెళ్లారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు కురాకుల వెంకటేశ్వర్లు, రవినాయక్, పిడిగం నాగయ్య, తాటి సత్యపాల్ పట్టణాధ్యక్షుడు వడ్డె సతీశ్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, నిడమనూరు ఎంపీపీ సలహాదారుడు బోల్లం రవి, యూత్ అధ్యక్షుడు సైదాచారి, నాయకులున్నారు.
త్రిపురారం : మండలం నుంచి బీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు అనుముల శ్రీనివాస్‌రెడ్డి, నిడమనూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కామెర్ల జానయ్య, మండల ప్రధాన కార్యదర్శులు పామోజు వెంకటాచారి, వనజ, జిల్లా రైతుబంధు సమితి సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్, జంగిలి శ్రీనివాస్, దైద రవి, గుండెబోయిన వెంకన్నయాదవ్, సుశీల్నాయక్ వెళ్లారు.