రైతుబంధు సాయం ఆపివేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్‌ఠాక్రే ఎన్నికల సంఘానికి లేఖ రాయడంపై రైతులు భగ్గుమన్నారు. నల్లగొండ జిల్లావ్యాప్తంగా గురువారం ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసనలు తెలిపారు. నిరసన కార్యక్రమాల్లో రైతులతో కలిసి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు.
మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణంలో ఎమ్మెల్యే భాస్కర్‌రావు ఆధ్వర్యంలో నాయకులు కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ తిరునగరు భార్గవ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, నాయకులు ధనావత్ చిట్టిబాబునాయక్, అన్నభీమోజు నాగార్జునచారి, జొన్నలగడ్డ రంగారెడ్డి, మదార్బాబా, కౌన్సిలర్లు,
వేములపల్లి : మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, సర్ప ంచ్ చిర్ర మల్లయ్యయాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కట్టా మల్లేశ్‌గౌడ్, పుట్టల పౌల్, దైద జాన్సన్, గౌరు శ్రీను, నక్క
దామరచర్ల : పేదలకు, రైతులకు, బడుగు బలహీన వర్గాలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలను నిలిపి వేయాలనీ కాంగ్రేస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేయడం సిగ్గుచేటనీ బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఆంగోతు హాతీరాం నాయక్, ఎంపీటీసీ సోము సైదిరెడ్డిలు అన్నారు. కాంగ్రేస్ పార్టీ నాయకులు తీరును నిరసిస్తూ
మండల కేంద్రంలోని నార్కట్‌పల్లి-అద్దంకి ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ జిల్లా నాయకుడు ఆంగోతు హాతీరాంనాయక్, ఎంపీటీసీ సోము సైదిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకుల దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పడిగెపాటి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు బాల సత్యనారాయణ, కందుల నాగిరెడ్డి, రఫీ, బైరం గోపి, బంటు రాము, జీ.కృష్ణయ్య, పరంగి సురేశ్, మాలునాయక్
మాడ్గులపల్లి : మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ జెర్రిపోతుల రాములుగౌడ్, ఎంపీపీ గౌరవ సలహాదారు పోకల రాజు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మారుతి వెంకట్‌రెడ్డి, కందిమళ్ల నరేందర్‌రెడ్డి, వెన్న శ్రవణ్‌రెడ్డి, ఇంద్రారెడ్డి, గోవిందరెడ్డి, సైదిరెడ్డి, పూర్ణయ్య పాల్గొన్నారు.
చిట్యాల : చిట్యాల పోలీస్‌స్టేషన్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లారెడ్డి, కొలను వెంకటేశం, మర్ల రాంరెడ్డి, కొలను సతీశ్, పొన్నం లక్ష్మయ్య, జిట్ట చంద్రకాంత్, కొనేటి కృష్ణ, బెల్లి సత్తయ్య, గోధుమగడ్డ జలంధర్‌రెడ్డి, జమాండ్ల శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
అడవిదేవులపల్లి : మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకుల దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కొత్త మర్రెడ్డి, మాజీ ఎంపీపీ కూరాకుల మంగమ్మ, కోఆప్షన్ మెంబర్ షేక్ బాబుజాని, మార్కెట్ డైరెక్టర్ బండి వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీను, ఉప సర్పంచ్ కేశబోయిన కొండలు పాల్గొన్నారు.