తిప్పర్తి, అక్టోబర్ 17: ధాన్యం అమ్మిన రైతుల ఖాతాల్లో 72 గంటల్లో డబ్బులు జమ చేస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కంకణాలపల్లి, అంతయగూడెం, మామిడాలపల్లి గ్రా మాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కంకణాలపల్లిలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి, తిప్పర్తి మండల కేంద్రంలో ధాన్యాన్ని తరలించే లారీలకు జండాఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల కండ్లల్లో సంతోషాన్ని చూడడమే ప్రభుత్వ ధ్యేయమన్నా రు. ప్రభుత్వం రైతులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, ఇం దులో భాగంగా వానకాలం ధాన్యం అమ్మిన రైతులకు డబ్బులు చెల్లించేందుకు రూ.25 వేల కోట్లను క్యాబినెట్ కేటాయించినట్లు వెల్లడించారు. రైతులు ధాన్యం అమ్మిన డబ్బుల కోసం నిరీక్షించాల్సిన అవసరం లేదని, 72 గం టల్లో వారి ఖా తాల్లో జమ చేస్తామని, ఒకవేళ డబ్బులు జమ కాకుంటే తనకు నేరుగా ఫోన్ చేయాలన్నారు. నల్లగొండ జిల్లా అత్యధికంగా ధాన్యం పండించే రెండో జిల్లాగా నిలిచిందని, రైతులు సన్న ధాన్యాన్ని ఎకువగా పండించాలని, ఆ దిశగా అధికారులు ప్రోత్సహించాలని సూచించారు.
ఆర్అండ్బీ శాఖ ద్వారా రూ.6,600 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. రూ.4500 కోట్లకు ఇటీవలే క్యాబినెట్ అనుమతి తీసుకున్నామని, త్వరలో టెండర్లు పిలిచి మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లు, గ్రామాల నుంచి మండలాలకు సింగిల్ రహదారి సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. రహదారి, రవాణా సౌకర్యం బాగున్నప్పుడే రైతులు ఉత్పత్తులను మారెట్కు తీసుకెళ్లేందుకు వీలు కలుగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు 7 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని, 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామన్నా రు. ధాన్యం మిల్లులు తరలించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. నాణ్యతా ప్రమాణాలతో వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు లారీల్లో మిల్లులకు తరలించాలని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఆర్డీవో శేఖర్ రెడ్డి, డీఎస్వో వెంకటేశ్, పౌర సరఫరాల డీఎం గోపీకృష్ణ, డీసీవో పత్యానాయక్, డీసీసీబీ డైరెక్టర్ సంపత్ రెడ్డి, పాశం రాంరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.