మునుగోడు ,ఏప్రిల్ 24 : రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని డీఆర్డీఓ శేఖర్ రెడ్డి అన్నారు. గురువారం మునుగోడు మండలంలోని కొంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసి ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన మాట్లాడుతూ.. తాలు ఉంటే తప్పకుండా తూర్పార పట్టిన తర్వాతే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకు రావాలన్నారు. కోనుగోలు చేసిన ధాన్యానికి త్వరగా బిల్లు సబ్మిట్ చేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఏపీఎం డి.మైసేశ్వరరావు, సిసి అంజయ్య, గ్రామ సంఘం అధ్యక్షురాలు, వీఓఏలు, రైతులు పాల్గొన్నారు.