దేవరకొండ రూరల్, అక్టోబర్ 15 : రైతులు సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు. బుధవారం దేవరకొండ మండలంలోని మర్రిచెట్టు తండా గ్రామ పంచాయతీ పరిధిలోని రైతు ఉత్పత్తిదారుల కేంద్రం (FPO) వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని సబ్సిడీ వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు పొందేలా ఈ విత్తనాలను సబ్సిడీతో అందిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆలంపల్లి నర్సింహా, మాజీ జడ్పీటీసీ మారుపాకల అరుణ సురేష్ గౌడ్, మాజీ ఎంపీపీ జాన్ యాదవ్, సీనియర్ నాయకులు రుక్మారెడ్డి, హన్మంతు వెంకటేష్ గౌడ్, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొర్ర రాంసింగ్ నాయక్, మాజీ సర్పంచ్ శ్రీను పాల్గొన్నారు.