మునుగోడు, మే 03 : రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం అందించే మద్దతు ధరను పొందాలని డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా మునుగోడు మండల పరిధిలోని కొరటికల్, పలివెల, కిష్టాపురం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న రైతులతో మాట్లాడారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే సమయంలో తాలు ఉంటే తప్పకుండా తూర్పార పట్టిన తర్వాతనే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు నిర్వాహకులు రైతుల ధాన్యాన్ని తూకం వేయగానే బిల్లులను ఆన్లైన్లో సబ్మిట్ చేయాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట ఏపీఎం మహేశ్వరరావు, సీసీలు శ్రీనివాస్, శంకర్, మల్లేశ్వరి, గ్రామ సంఘం సభ్యులు, వీఓఏలు ఉన్నారు.