శాలిగౌరారం, మే 15 : రైతులు పండ్ల తోటల సాగు చేపట్టాలని డీఆర్డీఏ పీడీ శేఖర్‌రెడ్డి అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వంద శాతం ఉచితంగా అందించే పండ్ల తోటలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గురువారం నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని పెర్కకొండారం గ్రామంలో నర్సరీ, మునగ తోటను ఆయన పరిశీలించి మాట్లాడారు. మునగ, డ్రాగన్ ఫ్రూట్, నిమ్మ, కొబ్బరి, మామిడి తదితర పంటల సాగుకు చిన్న, సన్నకారు, ఎస్సీ, ఎస్టీ రైతులు దరఖాస్తు చేసుకున్నట్లైతే మంజూరు చేస్తామని తెలిపారు.
గ్రామాల్లో నర్సరీ పట్ల పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఈజీఎస్ సిబ్బంది శ్రద్ధ వహించి వంద శాతం మొక్కలు పెరిగి, గ్రీనరీగా ఉండేలా చూడాలన్నారు. జూన్ నాటికి అన్ని గ్రామాల్లో ప్లాంటేషన్‌కు సిద్ధంగా ఉండేటట్లు ప్రణాళిక చేసుకోవాలని తెలిపారు. నర్సరీ నిర్వహణ, ఉపాధి పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఏపీడీ నర్సింహారావు, క్లస్టర్ టీఏ రమణ, ఎంపీఓ సుధాకర్, ఏపీఓ జంగమ్మ, టీఏలు నరేశ్, సత్యనారాయణ, విక్రమ్, రవికిరణ్, శోభారాణి, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఏరా బుచ్చయ్య, బట్ట సైదులు, ఎర్ర యాదగిరి, ఏనాల లింగమ్మ పాల్గొన్నారు.