అర్వపల్లి, జూలై 23 : వాతావరణంలో వచ్చిన అనూహ్య మార్పుల వల్ల ఏర్పడ్డ ఎల్ నినో ప్రభావంతో తగినంత వర్షాలు పడే అవకాశం లేదని అర్వపల్లి మండల వ్యవసాయ అధికారి పెందోట గణేష్, సర్పంచ్ బింగి కృష్ణమూర్తి అన్నారు. గురువారం జాజిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ వద్ద రైతులతో ఏర్పాటు చేసిన సమీక్షలో వారు మాట్లాడారు. ఎల్ నినో ప్రభావంతో వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఈసారి తగినంతగా వర్షాలు పడే అవకాశం లేదని, భూగర్భజలాలు అడుగంటుతాయని కావునా రైతులందరు వరి పంటను తగ్గించి ఆరుతడి పంటలైన కందులు, జొన్నలు, పెసర్లు, ఉలవలు, బొబ్బర్లు, శనగలు, మినుములు, సజ్జలు, కూరగాయలు లాంటి పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ సత్యం, వార్డు మెంబర్లు, రైతులు పాల్గొన్నారు.