మునుగోడు, ఏప్రిల్ 10 : రైతులు ధాన్యాన్ని 17 శాతం తేమ వచ్చే వరకు ఆరబెట్టి. తాలు లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని మునుగోడు మండల వ్యవసాయ అధికారి పద్మజ సూచించారు. గురువారం మండల పరిధిలోని కొరటికల్ గ్రామంలో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈ వానాకాలం 2025కి రైతులు బోల్ గార్డ్ II ప్యాకెట్ పత్తి విత్తనాలను కొనుగోలు చేయాలన్నారు. ధర 901 రూపాయలు మాత్రమే అని తెలిపారు.
కొనే విత్తనాలకి సంబంధించి బిల్ (రశీదు ) తీసుకోవాలని సూచించారు. లైసెన్స్ కలిగిన విత్తన డీలర్ దగ్గర మాత్రమే తీసుకోవాలన్నారు. పత్తి పంటకాలం అయిపోయే వరకు బిల్ భద్రపరుచుకోవాలన్నారు. తీసుకున్న బిల్ మీద విత్తన కంపెనీ పేరు, విత్తన రకం, బ్యాచ్ నంబర్, లాట్ నంబర్, రేటు ఉండాలన్నారు. విత్తన ప్యాకెట్ మీద తయారైన తేదీ, కాలం ముగిసే తేదీ చూసుకోవాలన్నారు. ప్రతి విత్తన ప్యాకెట్ మీద GEAC నంబర్ ఉందా లేదా చూసుకోవాలన్నారు.