సూర్యాపేట, సెప్టెంబర్ 8 : గత కొద్ది రోజులుగా యూరియా కోసం తండ్లాతున్న రైతులు సోమవారం సూర్యాపేట పట్టణంలోని మన గ్రోమోర్తో పాటు పిల్లలమర్రి పీఏసీఎస్‌కు యూరియా లోడ్ వచ్చిందనే విషయం తెలియడంతో రైతులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. ఒక్కో రైతు 5నుంచి 20ఎకరాల వరకు నాట్లు వేసుకున్నారు. వరి పైరు ఎదుగుదలకు మరో వారంలో యూరియా చల్లాల్సి ఉండగా ప్రభుత్వం యూరియా అందించకపోవడంతో అల్లాడిపోతున్నారు. సూర్యాపేట పట్టణంలొని మన గ్రోమోర్‌కు యూరియా వచ్చిందని తెలుసుకొని సూర్యాపేటతో పాటు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. యూరియా దొరకని రైతులు ఎక్కడ ఆందోళనలు చేస్తారోననే భయంతో అధికారులు పోలీసుల సమక్షంలో టోకెన్లు జారీ చేశారు.
క్యూలో పాసు పుస్తకాలు,
నల్లగొండ సిటీ సెప్టెంబరు 8 : కనగల్ మండలం లింగోటంలో మన గ్రోమోర్ షాపులకు యూరియా వచ్చిందని ఉదయం 5 గంటలకే రైతులు తరలివచ్చారు. ఒక్కో సెంటర్ వద్ద సుమారు 200 మంది రైతులు బారులు తీరారు. క్యూలైన్లో సీరియల్ కోసం పట్టాదారు పాస్‌బుక్కులు,ఆధార్ కార్డులు పెట్టారు.
కోదాడ- జడ్చర్ల హైవేపై రైతుల ధర్నా..
త్రిపురారం, సెప్టెంబర్ 8: యూరియా కోసం రైతులు కోదాడ- జడ్చర్ల హైవేపై త్రిపురారం ప్రధాన సెంటర్లో సోమవారం ఉదయం భారీ ధర్నా నిర్వహించారు. రాత్రింబవళ్లు క్యూలో నిల్చొన్నా ఇల్లు, పిల్లలను వదిలి భార్యభర్తలు క్యూలో ఉన్నప్పటికీ ఒక్క కట్ట యూరియా లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
యూరియా లారీని అడ్డుకున్న రైతులు..
కోదాడ రూరల్, సెప్టెంబర్ 8:మండల పరిధిలోని తొగర్రాయిలో రైతులు యూరియా లారీని అడ్డుకోవడంతో సోమవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. ఉదయం గ్రామంలోని గోదాం వద్దకు యూరియా లోడుతో వచ్చిన లారీ 250 కట్టలను దిగుమతి చేసి మిగతా లోడుతో వెళ్లేందుకు సిద్ధమైంది. దీంతో రైతులు లారీని అడ్డుకున్నారు. వచ్చిన లోడులో సగం దింపి మిగతాది తరలించడం సరికాదని, పూర్తి స్ధాయిలో రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్సై సిబ్బందితో గ్రామానికి వెళ్లి రైతులకు సర్ది చెప్పినా వారు అంగీకరించలేదు. పీఏసీఎస్ చైర్మన్ సర్ది చెప్పడానికి ప్రయత్నించగా ఆయనపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేళ్లచెర్వులో..
మేళ్లచెర్వు, సెప్టెంబర్ 8 : మేళ్లచెర్వు పీఏసీఎస్ ఎదుట సోమవారం రైతులు ఓటర్ల మాదిరిగా బారికేడ్ల మధ్య యూరియా కోసం ఎదురు చూపులు చూశారు. ఓటర్ల అవతారం ఎత్తారు. డిమాండ్‌కు సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడంతో ఆదివారం సాయంత్రం అధికారులు సొసైటీ ఎదుట బారికేడ్లు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం నుంచే రైతులు బారులు దీరారు. పోలీసుల పర్యవేక్షణలో స్టాక్ ఉన్నంత వరకు పంపిణీ చేయగా యూరియా అందనివారు ఖాళీ చేతులలో ఇంటిబాట పట్టారు.