చండూరు, సెప్టెంబర్ 04 : నాబార్డ్, నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో గురువారం రైతు సేవా సహకార సంఘం చండూరు ప్రాంగణంలో ఆర్థిక అక్షరాస్యత, నగదు రహిత లావాదేవీలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సంఘం అధ్యక్షులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్ కోడి సుష్మ వెంకన్న ముఖ్య అతిథి విచ్చేసి మాట్లాడారు. బ్యాంకు ద్వారా అందిస్తున్న సేవలను రైతులకు తెలియజేశారు. మార్టగేజ్, ఎడ్యుకేషన్, గోల్డ్ లోన్ అలాగే సంఘం ద్వారా క్రాప్ లోన్ సేవలను వివరించారు.
ప్రస్తుత పాలకవర్గం సంవత్సరానికి దాదాపు రూ.60 లక్షల వరకు క్రాప్ లోన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతులు గమనించి సంఘం, బ్యాంక్ పురోగతికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీబీ బ్రాంచ్ చండూరు మేనేజర్ అనుముల భరత్, సంఘ సెక్రటరీ పాల్వా అమరేందర్ రెడ్డి, ఇఫ్కో టోక్యో ఇన్సూరెన్స్ మేనేజర్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.