చౌటుప్పల్‌రూరల్, నవంబర్ 7: అధిక వర్షాలకు పత్తిపంట పూర్తిగా రంగుమారి నష్టాలు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చౌటుప్పల్ మండలం అఖిరెడ్డిగూడెంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… చౌటుప్పల్ మండలం అఖిరెడ్డిగూడెం గ్రామానికి చెందన ఉపేందర్‌రెడ్డి(43) తన 9 ఎకరాల భూమిలో పత్తి పంట సాగు చేశాడు.
పెట్టుబడి కోసం బంగారం కుదవబెట్టాడు. దాదాపు రూ.7 లక్షలు అప్పు చేసి పత్తి సాగు కోసం పెట్టుబడి పెట్టాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తిపంట పూర్తిగా రంగుమారి చేతికి రాకుండా పోయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఉపేందర్‌రెడ్డి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ మన్మథకుమార్ తెలిపారు. రైతు కుటుంబాన్ని ప్ర భుత్వం ఆదుకోవా లని స్థానికులు కోరుతున్నారు.