చిట్యాల, జులై 03 : పొలం పనులు చేస్తుండగా రైతు అకస్మాత్తుగా మృతి చెందాడు. ఈ ఘటన చిట్యాల మండలం నేరడ గ్రామంలో జరిగింది. ఎస్ఐ మామిడి రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నేరడ గ్రామానికి చెందిన రైతు వడ్డేపల్లి సైదులు రోజు వారి వ్యవసాయ పనుల్లో భాగంగా గురువారం ఉదయం పొలానికి వెళ్లాడు. పొలంలో పని చేస్తుండగా అకస్మాత్తుగా మూర్చ రావడంతో బురద పొలంలో పడిపోయాడు. దీంతో ఊపిరి ఆడక అకడికక్కడే మృతి చెందాడు. సైదులు భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.