తుంగతుర్తి, జనవరి 26 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మెడి విజన్ కంటి ఆస్పత్రి హైదరాబాద్ సహకారంతో తుంగతుర్తి మండల కేంద్రంలో సోమవారం ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్ ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు పాలవరపు సంతోష్ మాట్లాడుతూ.. పేదలు, వెనుకబడిన మారుమూల ప్రాంత ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శస్త్ర చికిత్స అవసరమైన వ్యక్తులు ఆరోగ్యశ్రీ కార్డు గానీ హెల్త్ కార్డు గాని కలిగి ఉంటే తామే ఆపరేషన్ చేసే ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయుల సంఘం కార్యదర్శి పులుసు ఉప్పలయ్య, దుగ్యాల మాధవరావు, కాసం మల్లయ్య, మౌలా సుధాకర్ రెడ్డి, మెడి విజన్ కంటి ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.