నకిరేకల్, జులై 05 : నకిరేకల్ పట్టణానికి చెందిన పెన్షనర్స్ అసోసియేషన్ కార్యదర్శి కందుల సోమయ్య సతీమణి సక్కుబాయమ్మ శుక్రవారం సాయంత్రం అనారోగ్యంతో మరణించింది. లయన్స్ క్లబ్ నకిరేకల్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యుల సమ్మతితో ఐ డొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరనాధ్, టెక్నీషియన్ బి.జానిచే నేత్రాలను సేకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ హరనాధ్ మాట్లాడుతూ.. గడిచిన 8 నెలల కాలంలో 141 మంది దాతల నుండి సేకరించిన కార్నియాల ద్వారా అంధులకు కంటి చూపును అందించి వారి, వారి కుటుంబాల్లో వెలుగులు నింపినట్లు తెలిపారు.
లయన్స్ క్లబ్ నకిరేకల్ అధ్యక్షుడు రేపాల సతీశ్ మాట్లాడుతూ.. కటుంబమంతా తీవ్ర దుఖ సాగరంలో మునిగి ఉన్నప్పటికీ ముందుకు వచ్చి నేత్రదానం చేయడం గొప్ప మనసుకు నిదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి, నకిరేకల్ లయన్స్ చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమం చైర్మన్ ఎన్.రామ్మోహన్రావు, కార్యదర్శి ఎన్.సూర్యచంద్రరావు, గాట్ మెంబర్షిప్ కోఆర్డినేటర్ శివకోటి, ఆంజనేయులు, గుప్తా పాల్గొన్నారు.