తుంగతుర్తి, జనవరి 26 : తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామంలో సోమవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి జిల్లాలోనే మన గ్రామాన్ని మొదటి స్థానంలో నిలబెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు దొంగరి శ్రీనివాస్, మట్టిపెల్లి వెంకట్, మరికంటి శ్యామ్, రాయుడు, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.