రామగిరి, సెప్టెంబర్ 26 : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని చర్లపల్లి డీవీఎం కళాశాల ప్రిన్సిపాల్ బి.నారాయణరెడ్డి, సూపరింటెండెంట్ చొల్లేటి శ్రీధర్ అన్నారు. శుక్రవారం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఇప్పటికే నాటి ఏపుగా పెరిగిన మొక్కలకు పాదులు చేశారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలతో కళాశాల ఆవరణ పచ్చని వాతావరణంలో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో ఎంఈడీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ బొడ్డుపల్లి రామకృష్ణ, అధ్యాపకులు ఆర్.సత్యనారాయణ, మేడిపల్లి రవి, ఎ.సరిత, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు శ్రీధర్‌రెడ్డి, విజయలక్ష్మి, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.