చండూరు, ఆగస్టు 25 : చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో ప్రతి ఒక్కరు ఇంటి చుట్టుపక్కల, రోడ్ల వెంట మొక్కలు పెంచాలని మున్సిపల్ కమిషనర్ ఎల్.మల్లేశం అన్నారు. వన మహోత్సవం, వంద రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు బ్రహ్మంగారి వీధి నందు కమిషనర్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి ఇంటింటికి తిరిగి హోమ్ స్టేడ్ మొక్కలు పంపిణి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ వార్డుల్లో, రోడ్ల వెంట, ఇంటి చుట్టుపక్కల విరివిగా మొక్కలు పెంచినట్లయితే పచ్చదనంతో పాటు ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన గాలి వస్తుందని, దీనివల్ల అందరూ ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ వార్డ్ ఆఫీసర్స్, ఎన్.జోజి, పి.విజయ్ కుమార్, ఎన్.సరిత, టీఎంసీ, ఎం.అరవింద్ రెడ్డి, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్, మెప్మా సిబ్బంది, బిల్ కల్లెక్టర్స్, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
Chandur : ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు పెంచాలి : మున్సిపల్ కమిషనర్ మల్లేశం