– వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్రెడ్డి
నీలగిరి, జనవరి 13 : నల్లగొండ పట్టణాన్ని ప్రమాద రహిత పట్టణంగా మార్చేందుకు అరైవ్ అలైవ్ కార్యక్రమానికి ప్రజలు, యువత పూర్తిగా సహకరించాలని వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోరారు. సోమవారం స్థానిక భాస్కర్ టాకీస్ చౌరస్తా వద్ద వాహనాదారులకు సురక్షిత ప్రయాణంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బైక్ నడిపే వారే కాకుండా, వెనుక కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల వారి ప్రాణాలకే కాకుండా, ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందన్నారు.
మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వవద్దని, ఒకవేళ వారు వాహనాలు నడుపుతూ పట్టుబడితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామన్నారు. వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ మాట్లాడటం అత్యంత ప్రమాదకరమన్నారు. వేగ పరిమితులు, ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు సూచిక బోర్డులను గమనిస్తూ వాహనాలు నడపాలన్నారు. మీ కుటుంబం మీ కోసం ఇంటి వద్ద వేచి ఉందని గుర్తుంచుకోవాలని వాహనదారులు గుర్తెరిగి వాహనాలను నడుపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు లచ్చిరెడ్డి, సైదులు, ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, వన్ టౌన్ సిబ్బంది, పట్టణ ప్రజలు, వాహనదారులు పాల్గొన్నారు.