Chivemula : ప్రతి విద్యార్థి ఉన్నత స్థానం పొందేలా బోధించాలి : కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్
ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత స్థానం పొందేలా బోధన చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. మంగళవారం చివ్వెంల మండల పరిధి ఉండ్రుగొండ శివారులో గల స్వామి నారాయణ గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్ నందు క్వాలిటీ ఎడ్యుకేషన్ పై ఉపాధ్యాయులకు జరుగుతున్న ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు.
చివ్వెంల, మే 13 : ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత స్థానం పొందేలా బోధన చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. మంగళవారం చివ్వెంల మండల పరిధి ఉండ్రుగొండ శివారులో గల స్వామి నారాయణ గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్ నందు క్వాలిటీ ఎడ్యుకేషన్ పై ఉపాధ్యాయులకు జరుగుతున్న ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఉపాధ్యాయుడు నిబద్ధతతో పనిచేసి ప్రతి పేద విద్యార్థి ఉన్నత స్థానం చేరుకునేలా చూడాలన్నారు.
సమాజంలోని అసమానతలు తొలగాలంటే విద్య ముఖ్య పాత్ర పోషిస్తుందని, అట్టి విద్యను అందించే ఉపాధ్యాయులపై గురుతర బాధ్యత ఉందన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రత్యేక బోధనపై ఉపాధ్యాయులకు మార్గ నిర్దేశం చేశారు. విద్యా సంవత్సరానికి గాను ప్రత్యేక ప్రణాళికలు రచించి ఆగస్టు 15లోగా ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం, గణితంలో చతుర్విద ప్రక్రియలు వచ్చేలా చూడాలని కలెక్టర్ సూచించారు.
కార్యక్రమానికి మండల రిసోర్స్ పర్సన్స్, ఆంగ్లము, గణితము, సాంఘిక శాస్త్రానికి సంబంధించిన పాఠశాలల సహోపాధ్యాయులు, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గ ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, కో ఆర్డినేటర్లు జనార్దన్, పూలమ్మ, స్వామి నారాయణ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఆర్ పి రాంబాబు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Chivemula : ప్రతి విద్యార్థి ఉన్నత స్థానం పొందేలా బోధించాలి : కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్

Chivemula : ప్రతి విద్యార్థి ఉన్నత స్థానం పొందేలా బోధించాలి : కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

