నీలగిరి, జూన్ 26: సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం నల్లగొండ జిల్లా పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా సాగేలా అధికారులు ఏర్పాట్లు చేయాలని రోడ్లు, భవనాలు, రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ సూచించారు. శుక్రవారం ఆయన నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంతో పాటు కనగల్‌లో సీఎం రూ.13,006 కోట్లతో ఆవిషరించనున్న హ్యాం రోడ్ల శంకుస్థాపన పైలాన్‌ను పరిశీలించారు.
ఎన్జీ కళాశాల మైదానంలో సీఎం హాజరుకానున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం ప్రసంగించే సభా వేదిక, బహిరంగ సభకు హాజరయ్యే ప్రజల కోసం ఏర్పాట్లు, టెంట్లు, జర్మన్ హాంగర్స్, లైటింగ్, సౌండ్, ఎల్ఈడీ, బ్యారికేడింగ్… ఒకో అంశాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. బహిరంగర సభ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు. సీఎం నల్లగొండ జిల్లాలో అడుగు పెట్టినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. సీఎం ఎన్జీ కళాశాల మైదానం చేరుకున్న వెంటనే రెండువైపులా ప్రజలకు అభివాదం చేసే విధంగా కాంక్రీట్ వేదికను సిద్ధం చేయాలన్నారు. ర్యాంప్ లేదా వాహనం ద్వారా సీఎం అకడికి వచ్చేలా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్లను ఆదేశించారు. వికాస్ రాజ్ జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వివరాలను ఎస్పీని అడిగి తెలుసుకున్నారు.
కనగల్ మారెట్ యార్డు సమీపంలో ఆవిషరించనున్న హ్యాంరోడ్ల పైలాన్‌ను పరిశీలించారు. పైలాన్‌కు వినియోగించే రంగులు, సుందరీకరణ పనుల గురించి ఆర్అండ్బీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పకనే ఉన్న హెలిప్యాడ్‌ను పరిశీలించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్ రెడ్డి, ఆర్ అండ్ బీ, హ్యాం రోడ్ల సీఈ వి.వెంకటేశ్వరరావు, రోడ్లు భవనాల సీఈ రాజేశ్వర్‌రెడ్డి, ఎస్ఈ శ్రీధర్‌రెడ్డి, డిప్యూటీ ఇంజినీర్ గణేశ్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వాణి పాల్గొన్నారు.