తుంగతుర్తి, జనవరి 24 : తెలంగాణ రాష్ట్రంలో నడిచేది ప్రజా పాలన కాదని.. కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా నాయకుడు గుండగాని రాములు గౌడ్ అన్నారు. శనివారం తుంగుర్తి మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. నైనీ కోల్ మైన్ లో జరిగిన అవినీతి అక్రమాలను బీఆర్ఎస్ పార్టీ వెలుగులోకి తెవడంతో రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు విధానాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్న కేటీఆర్, హరీష్ రావు మీద అక్రమ కేసులు పెట్టి విచారణల పేరుతో తిప్పుతిన్నట్లు దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టి మరల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల మీద తప్పుడు కేసులు బానాయించడం సరికాదని, రేవంత్ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.