గట్టుప్పల్, జనవరి 09 : గట్టుప్పల్ మండల పరిధిలోని అంతంపేట గ్రామానికి చెందిన నర్ర సత్తయ్య ఇటీవల అకస్మాత్తుగా మృతి చెందాడు. నిరుపేద కుటుంబం కావడంతో విషయం తెలిసిన ఈఎల్వీ భాస్కర్ ఫౌండేషన్ సత్తయ్య కుటుంబానికి ఆర్థిక సాయం, క్వింటా బియ్యంను పంపించారు. శుక్రవారం అంతంపేట గ్రామ శాఖ అధ్యక్షుడు ఐతరాజు హనుమంతు ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ చందా శ్రీలత వెంకటేశం, ఉప సర్పంచ్ శారద జబ్బర్ లాల్ మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కృష్ణయ్య, వీరమల్ల రాజు, నర్ర శ్రీనివాస్, నర్ర యాదయ్య, బాలరాజు, కృష్ణయ్య పాల్గొన్నారు.