వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆలయ అధికారులు ప్రారంభించారు. ఆలయాన్ని సప్తవర్ణాల్లో తీర్చిదిద్దేలా రంగు రంగుల విద్యుద్దీపాలంకరణ పనులు సాగుతున్నాయి. స్వయంభూ ప్రధానాలయం పునఃప్రారంభమైన అనంతరం గతంలో ఎన్నడూలేని విధంగా లైటింగ్‌కు ప్రభుత్వం ప్రత్యే కంగా రూ.50 లక్షలు కేటాయించింది. ప్ర ధానాలయంతోపాటు గార్డెన్, రింగురోడ్డు, ఘాట్‌రోడ్డు ప్రాంతాల్లో లైటింగ్‌ను బిగించనున్నారు.
సుమారు 25 వందల నుంచి 3 వేల విద్యుద్దీపాలు బిగించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే కొండపైన రామలింగేశ్వరస్వామి ఆలయం ఎదురుగా, క్యూ కాంప్లెక్స్ పక్కన నిర్మించిన విష్ణు పుష్కరిణిని సిద్ధం చేస్తున్నారు. శనివారం గుండాన్ని నీటితో శుద్ధి చేశారు.