మునుగోడు, మే 19 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బోల్గూరి నరసింహ అన్నారు. మాదగోని నరసింహ అధ్యక్షతన సీపీఐ రత్తిపల్లి గ్రామ శాఖ మహాసభ సోమవారం జరిగింది. ఈ సభకు బోల్గూరి నరసింహా హాజరై మాట్లాడారు. బ్రాహ్మణ వెల్లంల ఉదయం సముద్రం నుండి పులి పలుపుల చెరువులు నింపాలని, కలవలపల్లి గూడూపురు చెరువు నింపాలని, అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాజీవ్ యువశక్తి పథకానికి సిబిల్ స్కోర్ నిబంధన లేకుండా మంజూరు చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఎర్రజెండా ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు.
సీపీఐ మునుగోడు మండల కార్యదర్శి చాపల శీను మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ మండల కార్యవర్గ సభ్యుడు రమేశ్, గ్రామ శాఖ కార్యదర్శి మొకాల పరమేశ్, పున్నం యాదయ్య, పగిళ్ల స్వామి, పగిళ్ల శంకరయ్య, బొమ్మగోని స్వామి, బి.యాదయ్య, రాసమల్ల మహేశ్ పాల్గొన్నారు.