పెన్పహాడ్, జనవరి 24 : పెన్పహాడ్ మండల పరిధిలో నాగులపహాడ్ గ్రామంలో కాకతీయ రాజులు నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ త్రికుటేశ్వరాలయంలో ఫిబ్రవరి 15న జరగనున్న మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా సర్పంచ్ సంకరమద్ది నిరంజన్ రెడ్డి అధ్యక్షతన శనివారం ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడిగా ఒగ్గు సతీష్, ఉపాధ్యక్షులుగా ఏదుల్ల రామ్ రెడ్డి, ఒగ్గు దేవయ్య, ప్రధాన కార్యదర్శిగా కుక్కడపు నాగరాజు( గజిని), సహాయ కార్యదర్శిగా మామిడి సందీప్, గోలి శ్రీను, బూరుగు సోమయ్య, కోశాధికారి గా కందుకూరి నరేష్, కార్యవర్గ సభ్యులుగా మీసాల నాగరాజు, నంద్యాల వెంకటరెడ్డి, ఒగ్గు సైదులు, విజయ రావు, మచ్చ శంకర్, మీసాల బాబు, కొండ గణేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా ఒగ్గు సతీష్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజలందరి సహకారంతో మహా శివరాత్రి సందర్భంగా శివాలయంలో జరగనున్న ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నారాయణ కృష్ణారెడ్డి, కొండ జానకి రాములు, సంకరమద్ది శ్రవణ్ రెడ్డి, ఏపూరి నగేష్, శంకరమద్ది సుధీర్ రెడ్డి, మీసాల సోమయ్య, సంకరమద్ది పుల్లారెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ రాయి రమేష్, కుర్రి శ్రీను, పోగుల జానయ్య, బూర్గు అంజయ్య, జగ్గారెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, వంశీ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.