– అధ్యక్షుడిగా బి.వెంకటేశం, ప్రధాన కార్యదర్శిగా పి.ఏడుకొండలు
రామగిరి, జూలై 13 : డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (DTF) నల్లగొండ జిల్లా 16వ వార్షిక కౌన్సిల్ సమావేశం నకిరేకల్ జోనల్ శాఖ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన పెండింగ్ డీఏలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ రిపోర్టును పరిశీలించి, అతి త్వరలోనే కొత్త పీఆర్సీని అమలు చేయాలని, అలాగే ఉపాధ్యాయులు, పెన్షనర్లకు నగదు రహిత హెల్త్ కార్డులను అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన రాష్ట్ర కార్యదర్శి ఆర్.లింగయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల కుదింపు నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలన్నారు. పాఠశాలలను మూసివేయడం వల్ల గ్రామీణ ప్రాంతాలలోని పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
అనంతరం నిర్వహించిన నల్లగొండ జిల్లా నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది.
జిల్లా అధ్యక్షుడు : బి.వెంకటేశం
ప్రధాన కార్యదర్శి : పి.ఏడుకొండలు
ఉపాధ్యక్షులు : ఎం. గోపి, టి. వెంకటేశ్వర్లు, పుష్పలత
కార్యదర్శులు : ఎం.నాగయ్య, ఈ.జగతి, వీరస్వామి, విజయ్ కుమార్
రాష్ట్ర కౌన్సిలర్లు : ఎం.సోమయ్య, నాగేంద్రమ్మ, ఎండి.ఖుర్షీద్ మియా, పి.వెంకులు
ఆడిట్ కమిటీ కన్వీనర్ : వీరయ్య
ఆడిట్ కమిటీ సభ్యులు : ఫిరోజ్ దేశ్ముఖ్, పి.గోపాల్