శాలిగౌరారం, మార్చి 28 : గంటల వ్యవధిలో భార్యాభర్తలు మృతి చెందిన విషాద ఘటన శాలిగౌరారం మండలంలోని మాదారం కలన్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మామిడి ముత్తమ్మ (70) శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. ముత్తమ్మ భర్త మామిడి సైదులు (80) అప్పటికే అనారోగ్యంతో ఉండగా భార్య మరణ వార్త విషయం తెలిసిన గంటల వ్యవధిలోని ఆయన తట్టుకోలేక ప్రాణాలు విడిచినట్లు తెలిపారు. వీరికి ఓ కూతురు ఉంది.