కోదాడ, డిసెంబర్ 27 : సూర్యాపేట జిల్లా పెన్షనర్ల సంఘానికి నూతనంగా ఎన్నికైన కార్యవర్గం పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని కార్యాలయంలో ఇటీవల సూర్యాపేట జిల్లా కార్యవర్గంలో కోదాడ నుండి అధ్యక్షులుగా ఎన్నికైన బొల్లు రాంబాబు, విద్యాసాగర్, రవీంద్రనాథ్ ఠాగూర్, శోభారాణి, పొట్ట జగన్మోహన్ తో పాటు ఇతర సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం పెన్షనర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత నగదు వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు పెన్షనర్ల సమస్యలపై జరిగే పోరాటాలకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోదాడ యూనిట్ అధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి, హమీద్ ఖాన్, జానయ్య, వీరబాబు, భ్రమరాంబ, ఎస్ దాని, బాలే మియా, హాజీ నాయక్, గురవయ్య, పందిరి రఘువరన్, ప్రసాద్, తిరుపతమ్మ పాల్గొన్నారు.