చివ్వేంల, మార్చి15 : కృత్రిమ మేధతో విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. శనివారం చివ్వేంల మండలం వట్టిఖమ్మంపహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏఐ (కృత్రిమ మేధ) ల్యాబ్ ని జిల్లా విద్య శాఖాధికారి అశోక్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రాథమిక విద్య బలోపేతం చేయుటకు ప్రాథమిక పాఠశాలలో వెనకబడిన 3, 4, 5 తరగతులలోని సి గ్రేడ్ 10 మంది విద్యార్థులకు బేసిక్ మ్యాథ్స్, ఇంగ్లీష్ నేర్చుకోవడంతో పాటు వారిలో విద్యా ప్రమాణాల మెరుగుదలకు ఏఐ భోదన ఎంతో సహాయకారిగా పని చేస్తుందన్నారు.
ఏఐ ఆధారిత విద్యను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు కూడా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ కృష్ణయ్య, ఎంఈఓ రమణ, జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం శ్రీనివాస్, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం దయమణి, ఉపాధ్యాయులు పూర్ణ చంద్రశేఖర్, సైదులు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
AI : ఏఐతో విద్యా ప్రమాణాలు మెరుగు : అదనపు కలెక్టర్ రాంబాబు