గుండాల, జూలై 14: సీఎం రేవంత్‌రెడ్డి అబ్దుల్లాపూర్‌మెట్ పర్యటనకు వస్తున్న సందర్భంగా పోలీసులు యువజన నాయకులను ముందుస్తుగా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని బీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు అట్ల రంజిత్‌రెడ్డి అన్నారు. ఆదివారం గుండాల పోలీసులు మండలానికి చెందిన బీఆర్ఎస్, బీజేపీ యువజన నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, అందుకే ముఖ్యమంత్రి ప్రజల్లోకి వెళ్లాలంటే భయపడుతున్నారని తెలిపారు. యువజన నాయకులను, నిరుద్యోగులను, విద్యార్థులను మందుస్తుగా అరెస్టు చేయించి మరీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు గడ్డమీది మహోదయ్, జటంగి నాగరాజు, బీజేవైఎం మండలాధ్యక్షుడు మచ్చ వివాకర్రెడ్డి, రాజు ఉన్నారు.
ఆత్మకూరు(ఎం) : అబ్దుల్లాపూర్‌మెట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనను అడ్డుకుంటారనే అనుమానంతో ఆదివారం మండలంలోని బీఆర్ఎస్వీ, బీజేవైఎం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టు చేసిన వారిలో బీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు చుంచు నాగరాజు, నియోజకవర్గ నాయకులు గజ్జెల్లి మహేశ్, బీజేవైఎం మండలాధ్యక్షుడు పైళ్ల ప్రశాంత్, ప్రధానకార్యదర్శి లోడి మహేశ్, సూర్యప్రకాశ్, బండారి సాయి ఉన్నారు.
భూదాన్‌పోచంపల్లి : పోలీసులు ముందస్తుగా మండలానికి చెందిన బీజేవైఎం నాయకులను అరెస్ట్ చేశారు. సంఘం మండలాధ్యక్షుడు ఉప్పునూతల జగదీశ్, ఉపాధ్యక్షుడు కొత్త నవీన్, పట్టణ ప్రధాన కార్యదర్శి చిలువేరు నరేందర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మోటకొండూర్ : బీఆర్ఎస్ ఆలేరు నియోజకవర్గ ప్రధానకార్యదర్శి జి.వెంకటేశ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బీస కృష్ణంరాజు, బీజేవైఎం మండలాధ్యక్షుడు భూమండ్ల సతీశ్‌ను ఆదివారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో బీజెవైఎం మండల సోషల్ మీడియా అధ్యక్షుడు శెనిగరం ప్రదీప్, నాయకులు గాజుల బంగారి ఉన్నారు.