సూర్యాపేట అర్బన్ అక్టోబర్ 29 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల సంక్షేమాన్ని కాంక్షించి సకాలంలో చేప పిల్లల పం పిణీ జరిగేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం నామ మంత్రంగా పంపిణీ చేయడంతో మత్స్యకారులు నిరుత్సాహ పడుతున్నారు. వర్షాలతో కొన్ని చెరువుల్లో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ చేప విత్తనాలు పం పిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఈ నిర్ణయంతో ప్రతి గ్రామంలోని మత్స్యకారులు ఈ సారి చేప పెరిగేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి తోడు మత్స్య సహకార సంఘాల్లో ఉన్న వ్యక్తిగత కలహాలతో జిల్లాలోని చాలా సం ఘాలు సక్రమ నిర్వహణ లేకుండా ఉన్నా యి. వీటి నిర్వహణ కోసం జిల్లాలో పని చేస్తున్న జిల్లా పాలనాధికారులు కానీ, జిల్లా మత్స్యశాఖ అధికారులు కానీ, కార్యాలయం లో పని చేస్తున్న నియోజకవర్గ ఇన్చార్జిలు ర్జులు కానీ ముందుకు రావడం లేదనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.
సకాలంలో విడుదల ఏదీ?
చేప పిల్లలను ప్రభుత్వం సకాలంలో చెరువుల్లో వదిలితే ఏప్రిల్, మే నెలల్లో మత్స్యకారులు చేపలు పట్టుకుని అమ్ముకోవడం వల్ల కొంత ప్రయోజనం కలుగుతుంది. కానీ ప్రస్తుత ప్రభుత్వం అక్టోబర్ నెల పూర్తవుతున్నా ఇప్పటికీ ఎప్పుడు చేప పిల్లలను పంపిణీ చేస్తారనే దానిపై స్పష్టత ఇవ్వడం లేదు. సకాలంలో వదిలితేనే ఆర్థికంగా అంతంత మాత్రం ఇబ్బందులు పడే మత్స్యకారులు, ఆలస్యంగా వదలడం వల్ల ఆర్థికంగా నష్ట పోవడంతో పాటు అనుకున్న ప్రయోజనాలు కలగడం లేదు.
బినామీ కాంట్రాక్టర్లతో నాసిరకం చేప పిల్లలు
గతంలో ప్రభుత్వం చేప పిల్లలు ఉత్పత్తి చేసే వారితో చేప పిల్లల పంపిణీ నిర్వహించేది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలికి నాయకులు, జిల్లా ఉన్నతాధికారులు సహకారంతో బినామీ కాంట్రాక్టర్ల ద్వారా నాసిరకం చేప పిల్లలను పంపిణీ చేయడంతో వాటి ఎదుగుదల సక్రమంగా లేక మత్స్యకారులు నష్టపోతున్నారు. 2020-21లో అందించిన చేప పిల్లల పంపిణీ కంటే 2023-24 సంవత్సరంలో జిల్లాలో (గతంలో కంటే 50 శాతానికి తగ్గించి) చేప పిల్లల పంపిణీకి సిద్ధమయ్యారు. కాగా అందులోనూ 50 నుంచి 60 శాతం మాత్రమే కాంట్రాక్టర్లు పంపిణీ పూర్తి చేసినట్లు సమాచారం.
మత్స్యకారుల ఆశలు ఆవిరి..
సకాలంలో చేప పిల్లలు పంపిణీ చే యని ప్రభుత్వంపై జిల్లోలోని సుమా రు 15వేలకు పైగా మత్స్య సహకార సంఘాల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేపలు పట్టుకుని కుటుంబాలను పోషించుకునే మత్స్యకారు లు, చేప పిల్లల పంపిణీ ఆలస్యం కావడంతో వారి ఆశలు ఆవిరవుతున్నా యి. గతంలోనే మత్స్యకారులు ఆర్థికంగా ఉండగా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వారి జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. తమకు ప్రభుత్వం చేయూ తనందించి ఆదుకో వాలని మత్స్యకా రులు కోరుతున్నారు.