‘మత్తు పదార్థాల వినియోగంతో భవిష్యత్ అంధకారం’
మత్తు పదార్థాల వినియోగంతో యువత ఆరోగ్యం క్షీణించి వారి భవిష్యత్ అంధకారంగా మారుతుందని కోదాడ ఎస్ఐ బి.సుధీర్ అన్నారు. గురువారం కోదాడ కె ఆర్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాదక ద్రవ్యాల నివారణ అనే అంశంపై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో...
కోదాడ, జూలై 02 : మత్తు పదార్థాల వినియోగంతో యువత ఆరోగ్యం క్షీణించి వారి భవిష్యత్ అంధకారంగా మారుతుందని కోదాడ ఎస్ఐ బి.సుధీర్ అన్నారు. గురువారం కోదాడ కె ఆర్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాదక ద్రవ్యాల నివారణ అనే అంశంపై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. మాదక ద్రవ్యాలను అరికట్టడం సమాజ శ్రేయస్సుకు అత్యవసరమన్నారు. ఇందులో యువత కీలక భూమిక పోషించాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగంతో ఆరోగ్యం క్షీణించడంతో పాటు మానసిక దృఢత్వాన్ని కోల్పోయి నేర ప్రవృత్తికి అలవాటు పడి సంఘ విద్రోహక శక్తులుగా తయారవుతారన్నారు.
మత్తు పదార్థాలు అమ్మినా కొనుగోలు చేసినా స్వీకరించినా నేరస్తులేనని వారికి జైలు శిక్ష తప్పదన్నారు. దుర్వ్యసనాలకు దూరంగా ఉండి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా పోస్టర్ను ఆవిష్కరించారు. కళాశాల ప్రిన్సిపాల్ రమణారెడ్డి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి వేముల వెంకటేశ్వర్లు, పోలీస్ డ్రగ్స్ కమిటీ సభ్యులు హుస్సేన్ గౌడ్, అధ్యాపకులు నాగరాజు, పిచ్చిరెడ్డి, యాదగిరి, బల భీమారావు, రమేష్, రత్నకుమారి, వెంకన్న, రామరాజు, నరసింహారెడ్డి, మమత, చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

