కోదాడ రూరల్, జూన్ 24 : ప్రభుత్వ బడుల బలోపేతానికి దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని, దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆర్డీఓ సూర్యనారాయణ అన్నారు. మంగళవారం కోదాడ మండల పరిధి కాపుగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2024 – 2025 విద్యా సంవత్సరం పదో తరగతి వార్షిక ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చాటిని నలుగురు విద్యార్థులకు గ్రామానికి చెందిన మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు తన తల్లిదండ్రులు సుబ్బారావు, లక్ష్మమ్మ జ్ఞాపకార్థం నగదు బహుమతుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
అనంతరం ఉపాధ్యాయులు ఆర్డీఓను శాలువతో సత్కరించారు. విశ్రాంత ఉపాధ్యాయులు ముత్తవరపు రామారావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో నల్లూరి రవి, నంబూరి లక్ష్మయ్య, వెంకటేశ్వర్రావు, వీరపునేని కొండయ్య, జిల్లెపల్లి శ్రీనివాస్, బడిశ నరసింహారావు, హనుమంతరావు, అన్నబత్తుల రామయ్య, సుబ్బారావు, కాసాని వీరయ్య, బాలేబోయిన సతీశ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.