రామగిరి, సెప్టెంబర్ 25 : నల్లగొండలోని ప్రభుత్వ బీఈడీ కళాశాలకు దాతలు చేయూత అందించడం అభినందనీయమని డీఈఓ, ప్రభుత్వ బీఈడీ కళాశాల ఎఫ్ఏసీ ప్రిన్సిపాల్ బొల్లారం భిక్షపతి అన్నారు. ప్రభుత్వ బీఈడీ కళాశాలకు ఆ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ మల్యాల పాపయ్య ( 20 చైర్స్), లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ (20 చైర్స్) ఆధ్వర్యంలో కళాశాలలోని లైబ్రరీకి రూ.20 వేల విలువ గల 40 ఫైబర్ కూర్చీలు గురువారం కళాశాలలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలనే సంకల్పంతో, సేవా దృక్పథంతో కుర్చీలను అందించడం చాలా అభినందనీయమం అన్నారు. లయన్స్ క్లబ్ గవర్నర్ రేపాల మదన్మోహన్ మాట్లాడుతూ.. భవిష్యత్లో విద్యార్థులకు మరిన్ని సేవలందించేందుకు లయన్స్ క్లబ్ సిద్ధంగా ఉందన్నారు.
ఈ సమావేశంలో కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ డాక్టర్ మల్యాల పాపయ్య, లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ అధ్యక్షుడు నిమ్మల పిచ్చయ్య, లయన్స్ క్లబ్ ఆఫ్ విజన్, కార్నియా సేకరణ కన్వీనర్ డాక్టర్ ఎ సి హెచ్ పుల్లారావు, ప్రభుత్వ బీఈడీ కళాశాల సూపరింటెండెంట్ రాఘవేందర్, లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ కోశాధికారి ఆదినారాయణ, కార్యదర్శి ఎర్ర మాద అశోక్, కళాశాల అధ్యాపకులు వెంకట్రాంరెడ్డి, రఫీ, బి.రామకృష్ణ, దేవేందర్, జికేందర్, షమీ, శ్రీధర్ రెడ్డి, ఫాతిమా, సుభాషిని, సాదియా పరహిన్, గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకుడు సైదులు, పీడీ నరేష్, కార్యాలయ సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు క్రాంతి కుమార్ రెడ్డి, శశికళ, మల్లికార్జున్, రేణుక, దేవేంద్ర చారి, సిబ్బంది వెంకటేశ్, జంగయ్య, బీఈడి శిక్షణ ఉపాధ్యాయులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.