మునుగోడు, మే 06 : నల్లగొండ జిల్లా మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన పేదింటి క్రీడాకారుడు గుత్తి శివకుమార్ తండ్రి సత్తయ్య ఇంటర్నేషనల్ బేస్ బాల్ టోర్నమెంట్‌కు తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికయ్యాడు. యువకుడు పోటీల్లో పాల్గొనేందుకు పేదరికం అడ్డుపడుతుందని తెలుసుకున్న డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి రూ.20 వేలు, పూలమ్మ ఫౌండేషన్ చైర్మన్ వెదిరే మేఘారెడ్డి రూ.50 వేలు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వట్టికోటి శేఖర్ రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఇంటర్నేషనల్ బేస్‌బాల్ టోర్నమెంట్‌కు ఈ ప్రాంత వాసి ఎంపిక కావడం తమకు గర్వకారణమని ఈ సందర్భంగా దాతలు పేర్కొన్నారు.