అర్వపల్లి, సెప్టెంబర్ 20 : దాతలు అందించిన చేయూతను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని సుధాకర్ పీవీసీ మేనేజర్ అచ్యుత శర్మ అన్నారు. శనివారం అర్వపల్లి మండల పరిధిలోని తిమ్మాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సుధాకర్ పీవీసీ అధినేత మీలా మహదేవ్ అందించిన ఫర్నిచర్‌ను ఆయన పాఠశాలకు బహుకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యనభ్యసించేలా చేయూత అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కుంభం ప్రభాకర్, విశ్రాంత రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గుండా రమేశ్, వర్దెల్లి కృష్ణయ్య, నర్సయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.