పెన్పహాడ్, అక్టోబర్ 27 : పెన్పహాడ్ మండల పరిధిలోని చెట్ల ముకుందాపురం గ్రామంలో ఇటీవల కాలంలో అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న దేవాలయానికి భక్తులు విరాళాలు అందజేస్తున్నారు. సోమవారం అయ్యప్ప గుడి నిర్మాణానికి గ్రామానికి చెందిన మిర్యాల రామకృష్ణ తన వంతుగా రూ.2 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరూ అయ్యప్ప కృపకు పాత్రులు కావాలని, అందరూ గుడి నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని కోరారు. అనంతరం అయ్యప్ప మాలధారులు రామకృష్ణను ఘనంగా సన్మానించారు.