పెన్‌పహాడ్, సెప్టెంబర్ 24 : పెన్‌పహాడ్ మండల పరిధిలోని లింగాల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయానికి అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దొంగరి గోపి రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించాడు. బుధవారం ఆలయ పురోహితుడు ఇరువంటి సత్యనారాయణ శర్మ, శివాలయం కమిటీ చైర్మన్, రిటైర్డ్ ఏఎస్ఐ దాచేపల్లి సుధాకర్‌కు రూ.2 లక్షలు అందజేశారు. మిగతా రూ.3 లక్షలు నెలలోపు అందజేస్తానని గోపి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జూకూరు గాంధీ, దొంగరి రత్నమాల, దొంగరి మనేందర్, నల్లపు శ్రీనివాస్, మజ్జిగపు నర్సిరెడ్డి, మల్లెపల్లి దుర్గారెడ్డి, దాచేపల్లి అరవిందు, కేశిరెడ్డి కోటిరెడ్డి, రంగారెడ్డి, దొంగరి గోవర్ధన్, బొల్లం నాగరాజు, గార్లపాటి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.