మునుగోడు, ఏప్రిల్ 03 : తెలంగాణ పీడిత, అణగారిన వర్గాల చైతన్య జ్వాల దొడ్డి కొమురయ్య అని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి గుర్జ రామచంద్రం అన్నారు. కొమురయ్య 98వ జయంతిని పురస్కరించుకుని నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో గల కొమురయ్య విగ్రహానికి రైతు సంఘం, సీపీఐ నాయకుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామచంద్రం మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తిని పుణికి పుచ్చుకుని సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు, ప్రజాస్వామిక తెలంగాణ కోసం పునరంకితమవుదామని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బొలుగురి నరసింహ, జిల్లా కౌన్సిల్ సభ్యుడు సురిగి చలపతి, సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, మండల మాజీ జడ్పీటీసీ గోస్కొండ లింగయ్య, కార్యవర్గ సభ్యుడు దుబ్బ వెంకన్న, బీసీ సంఘం మండలాధ్యక్షుడు ఈదులకంటి కైలాష్, ఏఐవైఎఫ్ మండల ఉపాధ్యక్షుడు పుల్కరం ఆంజనేయులు పాల్గొన్నారు.