పట్టింపులకు పోయి నష్టపోవద్దు : సీనియర్ సివిల్ జడ్జి సురేశ్
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ చక్కటి మార్గమని కోదాడ సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కె.సురేష్ అన్నారు. శనివారం కోదాడ కోర్టులో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఉమర్ తో కలిసి జాతీయ లోక్ ఆదాలత్ ను..
కోదాడ, జూన్ 20 : దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ చక్కటి మార్గమని కోదాడ సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కె.సురేష్ అన్నారు. శనివారం కోదాడ కోర్టులో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఉమర్ తో కలిసి జాతీయ లోక్ ఆదాలత్ ను ప్రారంభించి మాట్లాడారు. రాజీ మార్గమే రాజ మార్గమని, కక్షలు, పట్టింపులకు పోయి కక్షిదారులు నష్టపోవద్దని సూచించారు. సత్వర న్యాయానికి లోక్ అదాలత్ లు సహకరిస్తాయని, కక్షిదారులు ఇట్టి అవకాశాన్నిసద్వినియోగం చేసుకుని విలువైన కాలాన్ని, ఆర్థిక నష్టాన్ని కాపాడుకుని ప్రశాంత జీవనాన్ని గడపాలని సూచించారు.
కోదాడ కోర్టులో క్రిమినల్ కేసులు 48, సివిల్ 8, బ్యాంక్ కేసులు 24 పరిష్కరించారు. బ్యాంక్ కేసుల రికవరీ రూపంలో రూ.10 లక్షలు వసూలు చేశారు. అడ్మిషన్ కేసులు 86, పిట్టి కేసులు 976 పరిష్కరించి 4 లక్షల 77 వేల రూపాయలు ఫైన్ రూపంలో వసూలు చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, ఉపాధ్యక్షుడు గట్ల నరసింహారావు, కార్యదర్శి రామకృష్ణ, జాయింట్ సెక్రటరీ జానీ పాషా, ట్రెజరర్ వెంకటేశ్వర్లు, సీనియర్ న్యాయవాదులు మేకల వెంకట్రావు, పాలేటి నాగేశ్వరరావు, చింతకుంట్ల రామిరెడ్డి, తమ్మినేని హనుమంతరావు, గోవర్ధన్, రవికుమార్, పారా లీగల్ వాలంటీర్లు, కోర్టు సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

